హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ యువసేన నాయకుడు సత్యారెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను సోమవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. రిలయన్స్ సంస్థలపై దాడుల కేసులో సత్యారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రిలయన్స్ పై పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు.
కాగా, రిలయన్స్ సంస్థలపై దాడుల కేసులో ఎన్ఎస్ యుఐ మాజీ నేత వంశీచందర్ రెడ్డిని కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ ఆదేశించింది. ఆయనను పోలీసులు చంచల్ గుడా జైలుకు తరలించారు. వంశీచందర్ రెడ్డిపై సైదాబాద్, ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సైదాబాద్ లో నమోదైన కేసులో వంశీచందర్ రెడ్డికి ఆదివారం రాత్రి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి