విజయవాడ: శబరమలై యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 12 మంది స్వాములు అసువులు బాశారు. వతనన్ తిట్టా జిల్లాలోని కరిమెల సమీపంలో వారు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందినవారు. వారంతా యువకులే. ఈ ప్రమాదంలో మరో 27 మంది గాయపడ్డారు. రెండు లారీల్లో 73 మంది స్వాములు, భక్తులు శబరిమలై బయలుదేరారు. శబరికి సమీవంలోని ఎలిమేడు నుంచి కాలినడకన వెళ్లాల్సిన వారు భారీ వర్షం కారణంగా లారీల్లోనే పంబకు బయలుదేరారు. ఈ సమయంలో ప్రమాదం సంభవించింది.
మంగళవారం రాత్రి శబరిమలైకి సమీపంలో భారీ వర్షం కురిసింది. పంబకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు కర్నాటకకు చెందినవారు కూడా మరణించారు. భారీ వర్షంలో వేలాది మంది భక్తులు చిక్కుకున్నారు. స్వాములు ఏర్పాటు చేసిన తాత్కాలిక విడుదులు కూడా జలమయ్యాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి