వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సినిమాలను అడ్డుకుంటే కాళ్లు నరుక్కున్నట్లే: డిఎస్

రామానాయుడు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, రామోజీరావు వంటి వారు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారని, వారెవరూ వెనక్కి పోరని, అయితే సినిమా పరిశ్రమకు ఆటంకాలు కల్పించడం మంచిది కాదని ఆయన అన్నారు. వ్యాపారాలను, సినిమాలను అపినంత మాత్రన తెలంగాణ రాదని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యుల రాజీనామాలు పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలని తాము కోరుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుందనే డిజిపి గిరీష్ కుమార్ వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. డిజిపి వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఆయన అన్నారు.