హైదరాబాద్: కేరళలోని శబరిమలై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య బుధవారం ఉదయం కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ తో మాట్లాడారు. ఈ మేరకు రోశయ్య కేరళ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో మరణించినవారి మృత దేహాలను రాష్ట్రానికి తరలించడానికి చర్యలు తీసుకోవాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన అచ్యుతానందన్ ను కోరారు.
తన విజ్ఞప్తికి కేరళ ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు రోశయ్య తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలియజేశారు. కేరళ ప్రమాదంలో కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన 12 మంది మరణించిన విషయం తెలిసిందే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి