హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం నాయకులు అదుర్స్ ను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు అడ్డుకోవడంపై తట్టుకోలేకపోతున్నారు. సినిమాను అడ్డుకుంటామని ప్రకటన చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు తీవ్రంగా విమర్శించారు. సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరిస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. తాను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతానని, అయినా చర్యలు తీసుకోరా అని ఆయన శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించిన కవిత ఎవరని తెలుగుదేశం నాయకుడు మహేందర్ రెడ్డి, తదితర నాయకులు హైదరాబాదులో అడిగారు. జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడివాడే అయినా సినిమా నిర్మాతలు సమైక్యవాదులు కాబట్టి సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని అనడం సరి కాదని వారన్నారు. దోచుకునేందుకే ఈ చర్యకు దిగారని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణకు సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం ద్వారా చెడ్డపేరు తెస్తున్నారని వారన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి