కర్నూలు: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన తెలంగాణ జన జాగృతి నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కవితను అరెస్టు చేయాలని రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ నేతలు విద్యార్థులను బొమ్మల మాదిరిగా ఆడుకుంటున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సమైక్యవాదులు నిర్మించినందున అదుర్స్ సినిమాను అడ్డుకుంటామని కవిత చెప్పిన విషయం తెలిసిందే. సినిమాను అడ్డుకునే విషయంలో తెరాస నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఆ నిర్ణయాన్ని తెరాస శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ సమర్థించుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అదుర్స్ సినిమా తెలంగాణలో ఆడుతోంది. అయితే పలు చోట్ల సినిమా ప్రదర్శన ఆగిపోయింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి