ఒకే అపార్టుమెంటులోని ఏడు ఫ్లాట్లలో చోరీ

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని కొత్తపేటలో గల విష్ణుప్రియ అపార్టుమెంటులో శుక్రవారం తెల్లవారు జామున దొంగలు ఇష్టారాజ్యంగా పడ్డారు. ఒకే అపార్టుమెంటులోని ఏడు ఫ్లాట్లలో దోపిడీకి పాల్పపడ్డారు. యజమానులు పండుగ కోసం ఊళ్లకు వెళ్లింది చూసి దొంగలు ఫ్లాట్లలో పడ్డారు. నగలు, నగదు వంటి పట్టుకుపోవడానికి వీలైన విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గాని దొంగతనం విషయం తెలియలేదు.

అపార్టుమెంటులో మొత్తం 24 ఫ్లాట్లున్నాయి. కొన్ని ఫ్లాట్లలో యజమానులున్నారు. వాచ్ మన్ కూడా ఉన్నాడు. కానీ తమకు ఎవరికీ దొంగతనం జరుగుతున్న విషయం తెలియలేదని అంటున్నారు. ఒకేసారి అన్ని ఫ్లాట్లలో పడి దోచుకుని వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. గొళ్లాలు కోసి ఫ్లాట్లలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం ఆరు గంటలకు వాచ్ మన్ చూసి దొంగతనం జరిగిన విషయాన్ని తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+