బిజెపి ధర్నా: బండారు దత్తాత్రేయ అరెస్టు

Bandaru Dattatreya
హైదరాబాద్: తెలంగాణపై రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం గన్ పార్కు వద్ద ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సహా పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుందని, నక్సల్స్ అణచివేతకు కేంద్రం నుంచి నిధులు రావలని గిరీష్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ బిజెపి శుక్రవారం ధర్నా చేసింది.

తన వ్యాఖ్యలను డిజిపి గిరీష్ కుమార్ వెంటనే ఉపసంహరించుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా డిజిపి మంచివారేనని, అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం డిజిపికి తగదని ఆయన అన్నారు. రాజీనామాల విషయంలో కాంగ్రెసు నేతల వైఖరిని ఆయన తప్పు పట్టారు. రాజీనామాలు ఎందుకు ఉపసంహరించుకున్నారో కాంగ్రెసు నేతలు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+