హైదరాబాద్: ఎలక్ట్రానిక్ మీడియా టేపులు పరిశీలించిన తర్వాత తెలంగాణ జన జాగృతి ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టుపై నిర్ణయం తీసుకుంటామని హైదరాబాదులోని బంజారాహిల్స్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సిఐ) చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా నుంచి అదుర్స్ సినిమాపై కవిత మాట్లాడిన టేపులను తెప్పిస్తున్నట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కవితపై తమంత తాముగా నమోదు చేసిన కేసుపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.
అదుర్స్ సినిమాపై కవిత చేసిన వ్యాఖ్యలను మరోసారి పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదుర్స్ సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యలకు గాను కవితపై పోలీసులు అభియోగాలు మోపారు.