కరీంనగర్ జిల్లా: రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

జిల్లాలో శనివారం జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది గాయపడ్డారు. కారు-ట్రాక్టర్ ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన కొల్చారం మం డల పరిధిలోని లోతువాగు వద్ద శనివా రం జరిగింది. హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన రాజు కుటుంబ సభ్యులు మెదక్‌లోని చర్చిని సందర్శించేందుకు వెళుతున్నారు. కొల్చారం నుంచి కౌడిపల్లికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న రాజు, మోజెస్, రేఖ, జీవన్‌లకు గాయాలు అయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన పల్పనూర్ బస్టేజి వద్ద శనివారం జరిగింది. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో శనివారం లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక మహిళకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళుతున్న కారును తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.












Click it and Unblock the Notifications