హైదరాబాద్: నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు సమయంలో జ్యోతిబసుతో కలిసి పనిచేసే అవకాశం తనకు దొరికిందని, ఆయనకు తనంటే ప్రత్యేక అభిమానం ఉందేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బసుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విలువులకు కట్టుబడిన నిబద్ధత కలిగిన నేత జ్యోతిబసు అని సంతాపం తెలిపారు. పాతతరం కమ్యూనిస్టు నేతలలో ఆయన గొప్పనాయకుడని, ఆయన అస్తమయం దేశానికి తీరని లోటని అన్నారు.
జ్యోతిబసులా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేయాలన్న ఆశ చంద్రబాబు నాయుడిలో ఉండేది. ఆయన రూపొందించుకున్న విజన్ -2020 డాక్యుమెంట్ లో పశ్చిమ బెంగాల్ లో జ్యోతిబసు అనుసరించిన వ్యూహాలు ఉన్నాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి