సమ్మర్ లో కచ్చితంగా వెళ్లాల్సిన 5 చల్లని ప్రదేశాలు ఇవే..
ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎలాగూ పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. దాంతో ఎండల బారి నుంచి బయటపడేందుకు ఎక్కడికైనా టూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? వేసవి తాపాన్ని మైమరిపించే అద్భుతమైన పర్యటక ప్రదేశాలను సందర్శించాలని ఉందా..? అయితే మనదేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సీజన్ ను బట్టి ఆయా ప్రాంతాలను సందర్శిస్తుంటారు పర్యటకులు. వాటిలో వేసవిలో విజిట్ చేయాల్సిన ముఖ్యమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. సమ్మర్ లో ఈ చల్లని ప్రాంతాల్ని సందర్శిస్తే మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
భారత్ లోని అత్యంత సుందరమైన ప్రాంతాల్లో మనాలి ఒకటి. ఏటా ఈ ప్రాంతానికి వేలాదిమంది పర్యటకులు వెళ్తుంటారు. ఇక్కడ చలికాలంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో మే నెలలోనూ అదే విధంగా ఇక్కడి వాతావరణం టూరిస్టులను కనువిందు చేస్తుంది. వేసవిలో ఇక్కడి ఎత్తైన పర్వతాలపై మంచును తనివితీరా ఆస్వాదించే వీలుంది. మనాలిలోని పర్యతాలు, లోయలు, పొంగి పొర్లే నదులు చూపుతిప్పుకోనివ్వదు. ఇక్కడ పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ కూడా చేసే వీలుంది.
అలాగే మరో ప్రముఖ టూరిస్ట్ ప్రాంతం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ పీఠభూమి.. ఈ ప్రాంతం చల్లని గాలులు, పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాతావరణం వేసవిలోనూ అద్భుతంగా ఉంటుంది. మనాలిలోని చల్లని ప్రదేశాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక డార్జీలింగ్ టూర్ కు చాలా మంది పర్యటకులు వెళ్తుంటారు. ముఖ్యంగా వేసవిలో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. డార్జీలింగ్ లో సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రాంతాల్ని చూసేందుకు చాలామంది వస్తుంటారు. ఇక తమిళనాడులోని ఊటీ ప్రాంతాన్ని కొండల రాణి అని పిలుస్తుంటారు. ఇక్కడి పూల తోటలు, వేసవిలోనూ చల్లని వాతావరణం పర్యటకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఊటీలోని వ్యూ పాయింట్స్, సరస్సుల గురించి ఎంత చెప్పినా తక్కువే..

ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ సరస్సు దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యమైనదిగా నిలుస్తోంది. నైని సరస్సులో బోటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. అలాగే లద్ధాఖ్- లేహ్ ప్రాంతం ప్రకృతి స్వర్గధామంగా అలరారుతోంది. ఈ ప్రాంతంలో రోడ్ ట్రిప్ లు, అడ్వెంచర్ బైక్ రైడ్స్ కు అనుకూలంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications