గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Guntur Dist
గుంటూరు: దాచేపల్లిలోని నవీన్‌ దాబా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ట్యాంకర్‌, లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. రోజుకి కనీస ఒక సంఘటన నమోదవుతోంది. నిన్న ఒక విచిత్రమైన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అసువులు బాసింది.

రోడ్డుకు అడ్డంగా వచ్చిన పిల్లిని తప్పించేందుకు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో సోమవారం రాత్రి స్థానిక నులకపేట సమీపంలో ఆటో పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. నలుగురికి గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు.. ఏలూరు పవర్‌పేటకు చెందిన లక్ష్మి, మరో ఆరుగురు బంధువులతో కలిసి చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మేనత్తను పరామర్శించేందుకు వచ్చింది.

తిరుగు ప్రయాణంలో ఆట ఎక్కారు. నులకపేట సమీపంలోకి వచ్చాక పిల్లిని చూసి డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో ఆటో అదుపు తప్పి పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మరణించింది. వెలపోలు సత్తెమ్మ, వెంకటలక్ష్మి, సత్యవతి, అనసూయలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో పిల్లి కూడా మరణించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వచ్చిన 108 సిబ్బంది బాధితల్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+