సిపిఎం నేత జ్యోతిబసు అంతిమ యాత్ర

సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు జ్యోతిబసు భౌతిక కాయాన్నితమ భుజాలపై మోస్తూ పార్టీ కార్యాలయంలోని వేదికపై ఉంచారు. జ్యోతిబసు అమర్ రహే, లాంగ్ లివ్ జ్యోతిబసు అనే నినాదాలు మిన్నంటాయి. మనవరాలు పాయెల్ జ్యోతిబసు భౌతిక కాయానికి పూలమాల వేస్తూ దుఖ్కాన్ని ఆపుకోలేకపోయారు. ఆదివారం నుంచి జ్యోతిబసు భౌతిక కాయాన్ని పీస్ హావెన్ లో ఉంచారు. జ్యోతిబసు భౌతిక కాయంపై అరుణ పతాకను కప్పారు. జ్యోతిబసుకు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు లోకసభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ, ఆర్జెడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు శాసనసభ వద్ద వేచి ఉన్నారు.












Click it and Unblock the Notifications