తెలంగాణపై కేంద్రాన్ని దింపుతాం: దామోదర్ రెడ్డి

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం దిగి రావాలని, దిగిరాకపోతే దింపి తీరుతామని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని చూసి ఆయన మంగళవారం కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకును పోగుట్టుకున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని దింపే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. తొందరపడి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. అవసరమైతే తానే బలిదానం చేస్తానని ఆయన అన్నారు. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని హైకమాండ్ చెప్పినా, పిసిసి చెప్పినా వినేది లేదని, ప్రజలే తన హైకమాండ్ అని ఆయన అన్నారు.

వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడియస్ యు నేత అశోక్ అన్నారు. దీనికి కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేణుగోపాల్ రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+