జిల్లాల్లో టిడిపి 'సమైక్యాంధ్ర' సదస్సులు

సమైక్యాంధ్ర ఉద్యమానికి మళ్లీ నేతలు సమాయత్తమవుతున్నారు. గత నెల 23న తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా కేంద్రం మరో ప్రకటన చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ కోస్తా, సీమల్లోని 13 జిల్లాల్లోనూ అన్ని వర్గాల ప్రజలను ఉద్యమానికి సిద్ధం చేయాలని నిశ్చయించారు. ఈ మేరకు జేఏసీ నేతలు, ప్రొఫెసర్లు ఎన్.శామ్యూల్, నరసింహారావు, గౌరీశంకర్, విద్యార్థి జేఏసీ నేతలు వెంకట రమణ, ఆశీరత్నం తదితరులు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిన్న విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడారు.
ప్రజలను ఉద్యమానికి సిద్ధం చేసేందుకు అన్ని జిల్లాల్లోనూ సదస్సులు నిర్వహించాలని, తొలి సదస్సును ఈనెల 20న విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం 24న నెల్లూరు, 25న తిరుపతిల్లో సదస్సులు నిర్వహించాలని, మిగతా జిల్లాల్లో సదస్సుల షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేస్తామని ప్రకటించారు. మరోపక్క, గుంటూరు జిల్లా జేఏసీ నేతలు కూడా సోమవారం సమావేశమయ్యారు. పరీక్షలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో విద్యార్థి గర్జన నిర్వహించడం భావ్యం కాదని, కేంద్రం ప్రకటన ఆధారంగా విద్యార్థి గర్జనపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications