తెలంగాణ వచ్చి తీరుతుంది: నాగం జనార్దన్ రెడ్డి

విద్యార్థి ఆత్మహత్య విషయం తెలిసి తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యతో విద్యార్థిలోకం దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాదులోనూ, తెలంగాణలోనూ విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ లో మానవ హారం ఏర్పాటు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, కాంగ్రెసు నాయకుడు ఆర్. దామోదర్ రెడ్డి, తెరాస నాయకుడు హరీష్ రావు సందర్శించారు. ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు ఉస్మానియాకు వచ్చారు.












Click it and Unblock the Notifications