తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మహత్య

Osmania Arts College
హైదరాబాద్: తెలంగాణ నాయకులు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా వేణుగోపాల రెడ్డి అనే విద్యార్థి మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగోర్ ఆడిటోరియం వద్ద ఆ విద్యార్థి శవం పడి ఉంది. ఒంటికి నిప్పు అంటించుకుని ఆ విద్యార్థి మరణించాడు. అతను విశ్వవిద్యాలయంలో ఎంసిఎ ఫైనలియర్ చదువుతున్నాడు. అతను నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందినవాడు. వెంటనే తెలంగాణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసి పెట్టి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే వేలాదిగా విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. లా కళాశాల విద్యార్థులు ఆత్మహత్యకు నిరసనగా బైక్ ర్యాలీ తీశారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల మనస్తాపాన్ని చూసైనా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకులు రామారావు గౌడ్, అజయ్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు పోరాడి తెలంగాణను సాధించుకుందామని, ఆత్మహత్యలకు మాత్రం పాల్పడవద్దని వారు విద్యార్థులను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+