తిరుపతి: తమిళనాడుకు చెందిన ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు తిరుమలలో ఆత్యహత్యా యత్నానికి పాల్పడ్డారు. తిరుమలలోని సప్తగిరి 376 కాటేజీలో ఈ సంఘటన జరిగింది. చెన్నైలోని తిరువన్నమలైకు చెందిన నాగమణి తన ముగ్గురుబిడ్డలతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. నాగమణితో పాటు ఓ బిడ్డ మరణించగా, ఇద్దరు బిడ్డల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
నాగమణి భర్త జాడ మాత్రం తెలియడం లేదు. అతను కనిపించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్మహత్యా యత్నానికి సంబంధించిన సమాచారం అందగానే తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంధి హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు మరణించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ఆత్మహత్యకు యత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి