వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేణు అంతిమ యాత్ర ర్యాలీకి పోలీసుల అడ్డంకి

వేణుగోపాల్ రెడ్డి ఆత్మాహుతికి నిరసనగా బుధవారం తెలంగాణ బంద్ జరుగుతోంది. వేణుగోపాల్ రెడ్డి అంత్యక్రియలు జరిగేలోపు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతాసంపూర్ణంగా రాజీనామాలు చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు ఇచ్చారు. రాజీనామాలు చేయని వారిని పల్లెల్లో తిరగనివ్వబోమని ఆయన అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంసీఏ విద్యార్థి కొండేటి వేణుగోపాల్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఠాగూర్ ఆడిటోరియం వద్ద సోమవారం రాత్రి ఆత్మాహుతి చేసుకున్నాడు. మంగళవారం ఉదయం అటువైపు జాగింగ్‌కు వెళ్లిన విద్యార్థులు ఇది గమనించి సహచరులకు, పోలీసులకు సమాచారం అందించారు.