హైదరాబాద్: జంటనగరాల్లో పాక్షికంగా సిటీ బస్సు సర్వీసులను పునరుద్దరించారు. ఎంఎంటీఎస్ రైళ్లు యథావిదిగా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆందోళనకారులు బస్సులను అడ్డుకుంటున్నారు. తెలంగాణకు మద్దతుగా విధులు బహిష్కరించి హయత్‌నగర్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ఉప్పల్, రామంతపూర్‌లో ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. ఆటోలు గురువారం యధావిధిగా నడుస్తున్నాయి. బస్సు సర్వీసులు తగ్గిపోవడంతో మెట్రో రైళ్లలో తీవ్ర రద్దీ కన్పిస్తోంది.
తెలంగాణ జిల్లాల్లో బస్సులు డిపోల నుంచి బయటికి రావడం లేదు. మేడారం జాతరకు వెళ్ళే బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులకు ఈ రాత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముంది. హైదరాబాద్ వెళ్ళే బస్సులకు రక్షణ కల్పించడానికి ఆంధ్రప్రాంతపు పోలీసులు ముందుకు వస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి