బెజవాడ యోగా, ధ్యాన కేంద్రానికి కలాం

Abdul Kalam
విజయవాడ: మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం 25, 26 తేదీల్లో విజయవాడ, పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన వెంట ఇద్దరు అధికారులు ఉంటారు. 25వ తేదీ మ.2.30గంటలకు కలాం హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి 3.30 గంటలకు విజయవాడ చేరుకుంటారు. 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి సా.4.15గం.లకు విజయవాడ, ఇండ్రస్టియల్‌ ఎస్టేట్‌లోని సిరీస్‌ యోగా మెడిటేషన్‌ సెంటర్‌ను సందర్శించి అక్కడి సభ్యులతో 4.30 వరకు చర్చలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు వెళతారు. 26వ తేదీ ఉదయం 11.30గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.30గంటలకు విజయవాడ స్టేట్‌గెస్ట్‌ హౌస్‌కు చేరుకుని భోజనవిరామం అనంతరం మ.1.30గంటలకు బయలుదేరి 2.30 గంటలకు నూజివీడు ఆర్‌జీయూ ట్రిపుల్‌ ఐటీ న్యూక్యాంపస్‌కు చేరుకుంటారు.

అనంతరం అక్కడి నుంచి 2.45గంటలకు బయలుదేరి 2.50గంటలకు పాత క్యాంపస్‌కు చేరుకుంటారు. 2.55గంటలకు వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి సభను ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేస్తారు. 3 గంటలకు మాజీ రాష్ట్రపతి విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 3.43గంటలకు ప్రొఫెసర్‌ ఇబ్రహీంఖాన్‌ వందన సమర్పణ చేస్తారు. 3.45గంటలకు నూజివీడు నుంచి బయలుదేరి 4.45గంటలకు గన్నవరం చేరుకుంటారు. 5.30గంటలకు బయలుదేరి హైదరాబాద్‌ వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+