హైదరాబాద్: తమ పార్టీ కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుపై కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి భగ్గుమన్నారు. విద్యార్థుల ముసుగులో తెలంగాణ నాయకులు ఉద్యమాలు సాగిస్తున్నారని కావూరి చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమాన్ని నక్సలైట్లు నడిపిస్తున్నారని కావూరి చేసిన వ్యాఖ్యను ఆయన ఖండించారు. విద్యార్థులను, యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం వెళ్తే ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తున్నారో తెలుస్తుందని ఆయన అన్నారు. దమ్ముంటే కావూరి సాంబశివర రావు ఒయుకు వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు. కావూరికి ఒయుకు ఏం సంబంధమో తెలియడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తాము నిర్దిష్ట కాలపరిమితితో వేసే కమిటీలను స్వాగతిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని ఆయన సీమాంధ్ర నేతలకు సూచించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి