హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన 50 మంది ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యు) కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో పిడిఎస్ యు అధ్యక్షుడు అశోక్ కుమార్, కార్యదర్శి గౌతం ప్రసాద్ ఉన్నారు.
విద్యార్థులు సచివాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి, లోనికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమను తొలగించడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసేసి పిడిఎస్ యు కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని నాంపల్లి పోలీసు స్టేషనుకు తరలించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి