విజయ్ దెబ్బకు డీఎంకే విలవిల, స్టాలిన్ సహా వారంతా.. దళపతి మేజిక్ .. మ్యాజిక్ ఫిగర్ దాటి..!!
తమిళనాట సంప్రదాయ పార్టీలకు భారీ షాక్. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన విజయ్ కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా టీవీకే పార్టీ దూసుకు వెళ్తోంది. అధికారం ఖాయమని భావించిన డీఎంకే మూడో స్థానంలో కొనసాగుతోంది. అన్నా డీఎంకే కూటమి రెండో స్థానంలో నిలిచింది. గెలిస్తే విజయ్.. లేదంటే హంగ్ అన్నట్లుగా ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. దీంతో.. డీఎంకే క్యాంపు లో నైరాశ్యం కనిపిస్తోంది. విజయ్ ను తమ వైపు తిప్పుకొని డీఎంకేకు అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అన్నా డీఎంకే అప్పుడే రంగంలోకి దిగింది. అయితే, విజయ్ మాత్రం అధికారం తమదే అనే ధీమాతో ఉన్నారు.
తమిళనాడు లో లెక్కలు తారు మారు అవుతున్నాయి. విజయ్ కింగ్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 108 స్థానాలో టీవీకే ఏకపక్షంగా దూసుకెళ్తోంది. డీఎంకే దూకుడుకు ఈవీఎం లు ఓపెన్ చేసిన సమయం నుంచి విజయ్ బ్రేకులు వేసారు. అన్నా డీఎంకే కూటమి రెండో స్థానంలో కొనసాగుతోంది. డీఎంకే 51, అన్నా డీఎంకే కూటమి 72 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో.. విజయ్ కింగ్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ కు కింగ్ గా మారే అవకాశం లేకపోతే.. హంగ్ తప్పదనేది స్పష్టం అవుతోంది. దీంతో.. అన్నా డీఎంకే ముఖ్య నేతలు అప్పుడే మంత్రాంగం ప్రారంభించారు. హంగ్ వస్తే విజయ్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నారు. ఫలితాల పైన మరింత స్పష్టత వచ్చిన తరువాత నిర్ణయం ప్రకటించేందు కు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అయితే, టీవీకే మాత్రం తమకు ఎవరి మద్దతు అవసరం లేకుండా తామే సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది.

తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో విజయ్
విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యతలో ఉన్నారు చెన్నై పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలో విజిల్ మోత మోగుతోంది. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెనుకజంలో కొనసాగుతున్నారు. అయితే.. ఇంకా పలు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఇదే ఊపు కొనసాగితే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితాలను డీఎంకే నేతలకు అంతు చిక్కటం లేదు. దీంతో.. స్టాలిన్ సీఎం కాకూడదనే ఏకైక లక్ష్యతో.. విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు అన్నా డీఎంకే కూటమి పావులు కదుపుతోంది. అసలు ఈ పరిస్థితి వస్తుందా లేక, విజయ్ మేజిక్ ఫిగర్ సాధిస్తారా అనేది తేలాల్సి ఉంది. దీంతో.. హంగ్ ఏర్పడే అవకాశముందన్న అంచనాలతో దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. గెలిచేవారంతా వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయంలో రిపో ర్టు చేయాలని ఆదేశించారు. వారిని ఓ రిసార్టుకు తరలించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అయితే, వస్తున్న ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications