పవన్ వల్ల కానిది.. !!

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.

ఈ ఎన్నికల్లో అతి పెద్ద సంచలనం.. టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనపర్చడం. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసిన టీవీకే 100 కు పైగా స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే రెండు, డీఎంకే మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ హంగ్ తప్పకపోవచ్చు. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మెజారిటీ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోండటంతో సీట్ల సంఖ్య మరింత పెరగొచ్చు.

Pawan Kalyan Struggles in AP as Vijay Dominates Tamil Nadu Election Scene with Monumental Debut

ఈ ట్రెండ్స్ తమిళనాడు రాజకీయ సమీకరణాలను నాటకీయంగా మార్చివేస్తున్నాయి. విజయ్ స్వతహాగా కింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ చూపిన అనూహ్య ప్రభంజనం, ఇతర పార్టీల మద్దతుతో కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించగలరు. బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోన్నందున విజయ్.. డీఎంకే వైపే మొగ్గు చూపే అవకాశాలు కొట్టిపారేయట్లేదెవరూ. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే ఆయనకు మెజారిటీ సీట్లను అందించాయనేది సుస్పష్టం.

ఏపీలో కూడా జనసేన పేరుతో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటికీ.. ఈ స్థాయిలో దూకుడు కనపర్చలేదు. 2019 నాటి ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీఎస్పీ వంటి పార్టీలన్నింటినీ కూడబెట్టుకుని పోటీ చేసినప్పటికీ.. ఆయనకు కనీస ఓట్లు పడలేదు. డిపాజిట్లు సైతం దక్కలేదు. పవన్ కల్యాణ్ స్వయానా గాజవాక, భీమవరంలల్లో ఓడిపోయారు. రాజోలులో మినహా మరెక్కడా పవన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. 2024 నాటికి పరిస్థితి మారింది. తొలుత బీజేపీతో ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి కాగలిగారు.

పవన్ కల్యాణ్ లాగే సూపర్ స్టార్ ఛరిష్మా ఉన్న విజయ్ మాత్రం దీనికి భిన్నం. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అధికారాన్ని అందుకోవడానికి చేరువ అయ్యారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేను నిలపగలిగారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎదురైన ప్రతి ప్రతికూల సంఘటననూ ఆయన విజయవంతంగా అధిగమించారనడానికి తాజా ఫలితాలే నిదర్శనం. హీరోగా తనకు ఉన్న మాస్ అభిమానాన్ని ఓట్ల రూపంలో మలచుకున్నారు విజయ్.. అది పవన్ వల్ల కాలేదు. 2024లో 21 స్థానాల్లోనే పోటీ చేశారాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+