కౌంటింగ్ వేళ.. పసిడి ధరల్లో అనూహ్యం

దేశంలో బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు నిలకడను సాధించాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 15,037 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్లు గ్రాముకు రూ. 13,784 పలుకుతోంది. వెండి ధర కిలో రూ. 2,55,100 వద్ద నమోదైంది. అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దేశీయంగా పసిడి, వెండి ధరలు కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోన్నాయి. ప్రస్తుతానికి వీటి ధరలు పెద్దగా పెరగట్లేదు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ఫ్యూచర్స్ రూ. 1,51,363 వద్ద స్థిరపడగా, వెండి 0.49 శాతం పెరిగి రూ. 2,47,500కి చేరుకుంది.

వచ్చే వారంలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం, చర్చల ప్రతిపాదనల్లో కదలికలు నెలకొనడం వంటి సానుకూల పరిణామాల వల్ల వీటి రేట్లు పెరగొచ్చని చెబుతున్నారు. పెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా వీటి ధరలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.

MCX Gold Steady in India 24K at Rs 151317 per 10 gram and Silver Downtick to as Rs 250630 per kg

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,50,420 రూపాయల వద్ద నిలిచింది. 22 క్యారెట్ల రూ. 1,37,990 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 150,370, 22 క్యారెట్లు రూ. 1,37,840గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,51,850, 22 క్యారెట్లు 1,39,190, కోల్‌కాతాలో 24 క్యారెట్లు రూ. 1,50,370, 22 క్యారెట్లు రూ. 1,37,804 వద్ద స్థిరపడింది. దేశీయంగా బంగారం ధరలను అంతర్జాతీయ బులియన్ రేట్లు, రూపాయి-డాలర్ కదలికలు, దిగుమతి సుంకం, సీజనల్ డిమాండ్ ప్రభావితం చేస్తాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,273, 22 క్యారెట్లు - రూ. 14,000, 18 క్యారెట్లు - రూ. 11,680

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+