విజయవాడ: దుర్గ గుడి కార్యనిర్వహణాధికారి విజయకుమార్ తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేస్తూ దుర్గ గుడి అర్చకులు సామూహిక సెలవుపై వెళ్లాలనుకుంటున్నారు. ఈవో తీరును తప్పుబట్టిన అర్చకులు, తమ నిరసన కార్యక్రమంలో భాగంగా 5 రోజులపాటు సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 40 మంది అర్చకులు సామూహిక సెలవుపై వెళుతున్నట్లు తెలిసింది. అసభ్యకర పదజాలంతో ఈవో తమను దూషిస్తున్నారని వారు ఆరోపించారు. అంతేకాక, తమను దొంగలుగా చిత్రీకరిస్తూ మీడియాలో కథనాలు రావడం మనను తీవ్ర మనఃస్థాపానికి గురిచేసిందన్నారు.
ఇదిలా ఉండగా, అర్చకుల్లోని గ్రూపుల కారణంగానే విభేదాలు తలెత్తాయని ఈవో అన్నారు. దుర్గ గుడిలో అనధికార అర్చకులు ఉన్నారనే అరోపణలపై విచారణ జరుపుతామని స్పష్టం చేసిన ఈవో, నిరసనకారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గుడిలో అక్రమాలు అరికట్టడమే తన బాధ్యత అని ఈవో స్పష్టం చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి