హాస్యనటుడు వడివేలుకు ఏడు కోట్ల షాక్

వడివేలుకు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఎదురుదెబ్బలు తప్పట్లేదు. స్నేహితుడు చేసిన మోసానికి లేని ఆస్తులకు పన్ను కట్టి రూ. 7 కోట్ల మేర మోసపోవడమే కాదు.. శ్మశానభూమిని కూడా కొనేశాడీ మనిషి. ఇటీవల ఆదాయపన్నుశాఖ అధికారులు చెన్నైలోని పలువురు సినీనటుల ఆస్తులపై ఆకస్మిక దాడులు చేశారు.
ఈ సందర్భంగా వడివేలు పలు ఆస్తులకు పన్నుకట్టలేదని తేలింది. ఆయన చెబుతున్న స్థిరాస్తులు కూడా ఏవీ లేవని తేలింది. ఇన్నాళ్లూ తన స్నేహితుడే ఆస్తిపాస్తుల వివరాలు చూసుకునేవాడని, అతడు తెచ్చిచ్చిన పత్రాలమీద సంతకాలు చేయడం తప్ప తనకేమీ తెలియదని గగ్గోలు పెట్టాడు. అలా తెచ్చిన పత్రాల ప్రకారం, వడివేలు ఓ శ్మశానభూమిని కొనేసినట్లు తేలింది. పైగా అసలు లేని ఆస్తులకు ఇన్నాళ్లూ వడివేలు భారీమొత్తంలో పన్ను కట్టినట్లు కూడా అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications