న్యూఢిల్లీ: కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలోని ఎబివిపి జారీ చేసిన ప్రకటన ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇబ్బందుల్లో పడేసింది. మహిళ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో పాకిస్థాన్ వాయుసేన అధికారి ఫోటో దర్శనం ఇవ్వడంపై ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం క్షమాపణలు తెలియజేసింది. భారత ప్రభుత్వ ప్రకటనలో విదేశీయుడికి స్థానం లభించడంపై విచారం వ్యక్తం చేసిన కార్యాలయం జరిగిన తప్పిదానికి క్షమాపణ తెలియజేసింది.
ఈ ఉదంతానికి సంబంధించి అంతర్గత విచారణకు ఆదేశించింది. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని డీఏవీపీ జారీ చేసిన ప్రకటనలో జాతీయ హీరోలు కపిల్‌దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, అంజాద్ అలీఖాన్‌లతో పాటు పాకిస్థాన్ వాయుసేనకు చెందిన మాజీ అధికారి తన్వీర్ అహ్మద్ ఛాయాచిత్రాలు దర్శనం ఇచ్చాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి