భార్యను కాల్చి చంపిన విలేకరికి జీవిత ఖైదు

పెళ్లి సమయంలో కవిత తల్లిదండ్రులు అల్లుడికి రూ. 50 వేలు నగదు, వస్తువులు కట్నంగా ఇచ్చారు. పెళ్లి జరిగిన నాటి నుంచి ఇచ్చిన కట్నం చాలదని అదనంగా మరో రూ. 50 వేలు తెమ్మని భర్త అత్త భవానమ్మలు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవారు. వెంకటరత్నంకు విజయ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమెను ఇంటికి తీసుకువచ్చేవాడు. ఇది ప్రశ్నించినందుకు ఆమెతో గొడవపడి కొట్టేవాడు.
దీనికి అత్త ప్రోత్సహించేంది. అదే రోజు కవిత మంచంపై పడుకొని ఉండగా వెంకటరత్నం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. చుట్టుప్రక్కల వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అత్త భవానమ్మ ఇంటిలోనే ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 21న ఆమె మరణించింది. మృతురాలి తండ్రి రమణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుచ్చిపోలీసులు భర్త, అత్తలపై కేసు నమోదు చేశారు. విచారణలో భర్తపై నేరం రుజువు కావడంతో అతనికి జీవిత ఖైదు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ అత్తపై నేరం రుజువు కాకపోవడంతో ఆమెపై కేసు కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు












Click it and Unblock the Notifications