వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక సవాళ్లను అధిగస్తాం: ఒబామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్: అమెరికా ఎదుర్కుంటున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కుంటామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరిస్తామని ఆయన చెప్పారు. అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఆర్థిక మాంద్యం తొలగిపోతోందని, ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతోందని ఆయన అన్నారు. మాంద్యం దెబ్బ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని ఆయన చెప్పారు. తీవ్రమైన ఒడిదొడుకుల నుంచి బయటపడ్డామని, కష్టాలను సమర్థంగా అధిగమిస్తామని ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

దేశంలో ఈ ఏడాది 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు. అమెరికాలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు పన్ను రాయితీ ఇస్తామని ఆయన చెప్పారు. భారత్, చైనాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని ఆయన అన్నారు. ఆ దేశాలు మనకు దారి చూపుతున్నాయని, అమెరికా మరింత వేగంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. చైనా, భారత్ మనకు సవాళ్లు విసురుతున్నాయని, అయితే ఆ దేశాల ఆశలు నెరవేరబోవని, ఎప్పటికీ అమెరికానే నెంబర్ వన్ అని ఆయన అన్నారు. తాను ప్రచారం కోసం పనిచేయబోనని, ప్రజల కోసం ఏమైనా చేస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X