విజయవాడలో హైటెక్ సిటీ: రోశయ్య ప్రారంభోత్సవం

ఈ ప్రాజెక్టు ఎప్పుడో సిద్ధం కావాల్సి ఉన్నా...గన్నవరం విమానాశ్రయానికి ఈ స్థలం చేరువలో ఉండటంతో హైటెక్ సిటీ భవనం ఎత్తు విషయంలో ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో విమానాశ్రయానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎల్ అండ్ టి ఎత్తును తగ్గించింది. హైటెక్ సిటీలో రెండు సంస్థలకు ఆఫీసు స్థలం కేటాయించారు. ఎక్స్‌ట్రాంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థకు 50 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించగా ఆ కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్‌ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మరో 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయించారు.












Click it and Unblock the Notifications