లక్ష్మీప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి

వివాహం ఖరారు చేసుకోవడానికి చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, ఎన్టీఆర్ సోదరులు కల్యాణ్ రామ్, జానకీరామ్, మరికొందరు సన్నిహితులు నార్నే శ్రీనివాస రావు నివాసానికి వెళ్లారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో చంద్రబాబుకు ఇది మూడవ బంధం. తాను మంత్రిగా ఉండగా ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కూతురు ప్రణతికి తన కుమారుడు లోకేష్ ను చేసుకున్నాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు తన కుటుంబానికే చెందిన లక్ష్మీప్రణతితో వివాహం ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీపై, ఎన్టీఆర్ వారసత్వంపై తన కుటుంబ సభ్యుల పట్టు కోసం చంద్రబాబు ఈ వివాహ బంధాలను పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications
