చిదంబరంపై సీమాంధ్ర ఎమ్మెల్యేల చిందులు

తెలుగు జాతిని విభజించే హక్కు కాంగ్రెసు కోర్ కమిటీకి ఎవరిచ్చారని తెలుగుదేశం శాసనసభ్యుడు దూళిపాళ నరేంద్ర చౌదరి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 21 కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఉండగా ఒక్క తెలంగాణ కోసమే ఎందుకు కమిటీ వేస్తున్నారని ఆయన అడిగారు.ఆంధ్రప్రదేశ్ విభజన అనేది చిదంబరం వ్యక్తిగత ఎజెండా అని దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెసుకు రాష్ట్రాల విభజనపై ఒక విధానం ఉండాలి గానీ ప్రాంతీయ పార్టీలాగా ఆంధ్రప్రదేశ్ పట్ల మాత్రమే ప్రత్యేకంగా వ్యవహరించడం సరి కాదని నరేంద్ర చౌదరి అన్నారు.












Click it and Unblock the Notifications
