దెబ్బకి అగ్రరాజ్యంగా సౌదీ! పవిత్ర నగరంలో కోట్ల టన్నుల అణు గనులు..

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గ్లోబల్ పాలిటిక్స్‌ను షేక్ చేసే ఒక సంచలన విషయాన్ని సౌదీ అరేబియా బయటపెట్టింది. ఇస్లాం ధర్మానికి అత్యంత పవిత్రమైన మదీనా ప్రాంతంలో వేల టన్నుల విలువైన ఖనిజ నిక్షేపాలు బయటపడ్డాయి. ఏకంగా 11 కోట్ల టన్నుల యురేనియం రేణువులు, అరుదైన రేర్ ఎర్త్ మూలకాలు ఇక్కడ లభ్యమైనట్లు సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ స్వయంగా ప్రకటించారు. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ యురేనియం నిధి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రాజకీయాన్నే కాదు.. ప్రపంచ శక్తి సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది.

ఇరాన్ అణు సామర్థ్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న పోరాటాలతో ప్రస్తుతం మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారింది. మరోవైపు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు, సౌదీ లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సౌదీ వద్ద యురేనియం కొండంత లభించడం ప్రత్యర్థి దేశమైన ఇరాన్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. సున్నీ ఆధిపత్య దేశమైన సౌదీ, షియా ఆధిక్యమున్న ఇరాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ఈ సహజ వనరులు ఒక ప్రధాన అస్త్రంగా మారనున్నాయి. మదీనా లాంటి పవిత్ర స్థలంలో ఇంతటి వ్యూహాత్మక ఖనిజాలు లభించడం భౌగోళికంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Mega Uranium Discovery in Medina Gives Saudi Arabia Huge Strategic Edge Amid Middle East Tensions
Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్
Umrah Visa: ఉమ్రా భక్తులకు షాక్, ఇక ఇలా మక్కా వెళ్లలేరు.. సౌదీ కొత్త రూల్

విజన్ 2030.. చమురు రాజ్యం నుంచి అణు శక్తి వైపు!

సౌదీ అరేబియా అంటే కేవలం ముడి చమురు మాత్రమే కాదు అని నిరూపించేందుకు ఆ దేశం 'విజన్ 2030' పేరిట వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో కేవలం ఆయిల్ మీద మాత్రమే ఆధారపడకుండా, ఇతర ఇంధన వనరుల వైపు మళ్లుతోంది. జబల్ సయ్యిద్ ప్రాజెక్టులో జరిపిన తాజా భూగర్భ పరిశోధనల్లో బయటపడిన ఈ అరుదైన నిధులు సౌదీ ఇంధన భవిష్యత్తును పూర్తిగా మార్చేయనున్నాయి. అణు విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన యురేనియం సొంతంగా లభించడంతో సౌదీ అరేబియా ఆర్థిక, సైనిక బలం రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Saudi Prince: లండన్ హోటల్లో శవమై తేలిన సౌదీ యువరాజు - ప్రపంచ దేశాలు షాక్..!
Saudi Prince: లండన్ హోటల్లో శవమై తేలిన సౌదీ యువరాజు - ప్రపంచ దేశాలు షాక్..!

అమెరికాతో బిగ్ డీల్.. సొంతంగా అణు సమృద్ధి!

ఈ యురేనియం నిక్షేపాలు బయటపడటానికి కొద్దిరోజుల ముందే అమెరికా-సౌదీల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. పౌర అణు రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికన్ కంపెనీలు సౌదీకి సహకరించనున్నాయి. దానికితోడు అమెరికా ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే, సౌదీ తన సొంత గడ్డపై యురేనియంను శుద్ధి చేసుకునే సౌలభ్యాన్ని కూడా ఈ ఒప్పందం కల్పిస్తోంది. ఒకవైపు వేల కోట్ల డాలర్ల అణు ఒప్పందం, మరోవైపు నిండుగా దొరికిన యురేనియం గనులు కలిసి సౌదీ అరేబియాను గ్లోబల్ న్యూక్లియర్ మ్యాప్‌లో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+