వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై డెడ్ లేన్లు వృధా: నారాయణ

రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం వల్ల తెలంగాణ రాదని, రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో పార్టీలు అవకాశవాదానికి పూనుకుంటున్నాయని ఆయన విమర్శించారు. గనుల మాఫియా బలోపేతమై ప్రజాస్వామ్యానికి సవాల్ విసురుతోందని ఆయన అన్నారు. తాడి చెర్ల బొగ్గుగనులను ప్రైవేట్ వారికి ఇవ్వవద్దని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. అనుమతి లేకుండా వేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. పోలీసులతో సిపిఐ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.