వైష్ణవి హత్య: సబితపై చిరంజీవి ధ్వజం

వైష్ణవి కిడ్నాప్ జరిగిన వెంటనే పోలీసులు స్పందించకపోవడం వల్లనే ఇంత దారుణం జరిగిందని ఆయన అన్నారు. కిడ్నాప్ జరిగిన వెంటనే విజయవాడను పోలీసులు అష్టదిగ్బంధం చేసి ఉంటే హత్య జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హత్య కేసులో నిందితుడు వెంకటరావు తమ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిన మాట నిజమేనని, తాము టికెట్ ఇవ్వలేదని, అతను ప్రస్తుతం చురుగ్గా పార్టీలో పనిచేయడం లేదని ఆయన వివరించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ జిల్లా నాయకులకు సూచించినట్లు ఆయన తెలిపారు. నాగవైష్ణవి తండ్రి ప్రభాకర్ మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications