వైష్ణవి కేసు: రంగంలోకి దిగిన 2 వేలమంది పోలీసులు

విజయవాడ, గుంటూరుకు చెందిన రెండువేల మంది రిజర్వు పోలీసులు ఇల్లిల్లూ తనిఖీ చేశారు. మూడు వందల మందికి పైగా రౌడీషీటర్లను విచారణ చేస్తూనే పలగాని కుటుంబ కలహాలపై కూడా దృష్టి కేంద్రీకరించారు. తొమ్మిది సెల్ కంపెనీల నెట్‌వర్క్ కేంద్రాల సహాయాన్ని తీసుకుని ఆదివారం రాత్రి 1.50 లక్షల కాల్స్‌ను పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి గుంటూరు జిల్లా ఆటోనగర్ వరకు మార్గమధ్యలో ఉన్న సెల్ టవర్ల మీద మాట్లాడిన వినియోగదారుల వివరాల జాబితాను సేకరించారు.
ఆ జాబితాలో లభ్యమైన ఒక నంబరు నుంచి సంఘటన జరిగిన సమయంలో (8.30 నుంచి 9.30 గంటల వరకు) 130 కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. నిందితుడైన శ్రీనివాసరావు నంబరుగా దానిని గుర్తించారు. ఈ నంబరు నుంచి శ్రీనివాసరావు వెంకట్రావ్‌కు ఫోన్ చేసినట్లుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో కేసు మిస్టరీ వీడింది. ఈ సెల్‌ఫోన్ కాల్ కాకుండా కేసు మిస్టరీకి సంబంధించి పోలీసుల వద్ద మరో ముఖ్యమైన ఆధారం ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications