చంద్రబాబు నన్ను అవమానించారు: జయప్రద

Jayaprada
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనను అవమానించారని, అందుకే తాను ఉత్తరాదికి వచ్చానని సమాజ్ వాదీ పార్టీ బహిష్కృత నేత, పార్లమెంటు సభ్యురాలు జయప్రద అన్నారు. చంద్రబాబు తనను అవమానించినప్పుడు ఏడ్చి ఏడ్చి కన్నీరు పెట్టి ఉత్తరప్రదేశ్ కు వచ్చినట్లు ఆమె చెప్పారు. ప్రధాన పార్టీల నాయకులు కార్యకర్తలు వాడుకుని ఆ తర్వాత వదిలేస్తున్నారని, తెలుగుదేశం పార్టీలో తన విషయంలో అలాగే జరిగిందని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తనపై కుట్ర చేసిన ఆజంఖాన్ తిరిగి పార్టీలోకి తెచ్చేందుకే సమాజ్ వాదీ పార్టీ నుంచి తనను బహిష్కరించారని, అమర్ సింగ్ బాధ పడడం చూడలేక తాను మద్దతుగా మాట్లాడానని ఆమె చెప్పారు. సైకిల్ నుంచి తనను ఎవరూ పడేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె అన్నారు. తాను చిన్నప్పుటి నుంచి సైకిల్ తొక్కుతున్నానని ఆమె అన్నారు. సమాజ్ వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీల ఎన్నికల చిహ్నం రెండు సైకిల్ కావడాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఆ విధంగా అన్నారు.

చంద్రబాబు తనను అవమానించినప్పుడు ఏడ్చి ఏడ్చి అందరికీ చెప్పుకున్నానని, అనుభవరాహిత్యం వల్ల అలా చేశానని, ఇప్పుడు తాను అలా లేనని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కుంటానని ఆమె అన్నారు. తనను ఆదరిస్తామంటే, గెలిపిస్తామంటే ఆంధ్రప్రదేశ్ కు వస్తానని, తాను ఆంధ్రప్రదేశ్ ఆడపడుచునని ఆమె అన్నారు. ఏ పార్టీలో ఇప్పుడే చేరబోనని, తనకు ఇంకా నాలుగున్నరేళ్ల వ్యవధి ఉందని, పార్లమెంటు సభ్యురాలిగా తన గడువు ముగిసిన తర్వాతనే ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకుంటున్నానని ఆమె అన్నారు. తనపై కూడా రాజకీయ దాడులు జరిగాయని ఆమె చెప్పారు. వాటిని తాను ఎదుర్కుంటానని ఆమె చెప్పారు.

తెలంగాణ, సమైక్యాంధ్రల్లో ప్రజలకు ఏం కావాలో అది చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. అర్థరాత్రి నిర్ణయం సరి కాదని ఆమె అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తాను తన అభిప్రాయం చెబుతానని ఆమె అన్నారు. తెలంగాణలో ఎదుటి తెలుగువాడినే అసహ్యించుకునే పరిస్థితి ఉందని, దానికి కారణాలేమిటో కనుక్కుని కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందా అనే విషయాన్ని ఆలోచించాలని, అన్నదమ్ముల్లా ప్రేమించుకునే అవకాశం ఉందా అని ఆలోచించాలని, అందుకు తగిన వాతావరణ కల్పించగలిగితే మంచిదని ఆమె పదే పదే ప్రశ్నించగా అన్నారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. కమిటీ వేయకూడదని తాను అనలేదని, అలాంటి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందని మాత్రమే అంటున్నానని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను ఉత్తరప్రదేశ్ పరిస్థితులతో పోల్చలేమని ఆమె ఉత్తరప్రదేశ్ విభజన డిమాండ్లపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+