త్వరలోనే విధివిధానాలు ఖరారు: దుగ్గల్

ముంబైలో ఉన్న జస్టిస్ శ్రీకృష్ణ ముంబైలోనే ఉన్నారు. ముంబై వెళ్లి శ్రీకృష్ణతో సమావేశమై విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా కేంద్ర మంత్రులు దుగ్గల్ కు సూచించినట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే తాను ఢిల్లీ రావడానికి కుదరదని శ్రీకృష్ణ చెప్పినట్లు తెలిసింది. తనకు కొన్ని పనులున్నాయని, ఆ పనులు పూర్తయ్యే వరకు ఢిల్లీలో ఉండడానికి వీలు కాదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. తాను ముంబై నుంచి పనిచేస్తానని కూడా ఆయన తెలిపినట్లు చెబుతున్నారు. అయితే ముంబై నుంచి పనిచేయడం సాధ్యం కాదని కేంద్ర మంత్రులు ఆయనతో అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications