మంత్రులకు ప్రధాని క్లీన్ - అప్ కోడ్

కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమకున్న వ్యాపారాసక్తులన్నింటినీ వదిలేయాలని సూచించారు. ఇప్పటివరకు తమకున్న వ్యాపారాల వివరాలు తెలియజేయాలని, వెంటనే వాటి యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే తమ ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించిన కేంద్ర కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు ఇకమీదట లిస్టెడ్ కంపెనీలలో తమకున్న షేర్లు, డిబెంచర్లు, నగదు పెట్టుబడులు, నగల వివరాలను కూడా ప్రకటించాలని ప్రధాని తెలిపారు.
ప్రవర్తనా నియమావళి అమలు తీరును కేంద్ర మంత్రుల విషయంలో ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తారు. ముఖ్యమంత్రుల విషయంలో ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి కూడా చూస్తారు. రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రికి నివేదించాల్సి ఉంటుంది. ప్రధాని తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, సుశీల్ కుమార్ షిండే, జైపాల్ రెడ్డి తదితరులు స్వాగతించారు.












Click it and Unblock the Notifications