సిడబ్ల్యుసిలో తెలంగాణ చర్చకే ఢిల్లీకి రోశయ్య

ప్రభుత్వపరంగా జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల సంప్రదింపుల కమిటీని వేసిన తర్వాత పార్టీపరంగా కూడా కచ్చిమైన వైఖరిని వెల్లడించడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధమైనట్లు సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు వైఖరి చెప్పాలంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజెపి నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెసు ప్రత్యర్థులు. ఆ పార్టీలను ఆత్మరక్షణలో పడేసేందుకు పార్టీ వైఖరిని వెల్లడించడానికి కాంగ్రెసు సిద్ధమైనట్లు చెబుతున్నారు. సిడబ్ల్యుసి సమావేశం తర్వాతనే శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications