పలగాని కుటుంబానికి పూర్తి భద్రత: సబితా ఇంద్రారెడ్డి

లక్ష్మణరావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని, పిల్లలకు విద్యను అందిస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆమె చెప్పారు. నాగవైష్ణవి హత్య కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రసుత్తం ఉన్న చట్టాల పరిధిలో దోషుల్ని శిక్షిస్తామని ఆమె చెప్పారు. ఈ కేసు పూర్తి వివరాలను నగర పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు వివరిస్తారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications