వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై జయప్రద మాట్లాడాలి: కోదండరామ్

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు సంఘటితంగా ఉద్యమిస్తున్నారని చూపించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తాము శాంతియుతంగా ఉద్యమిస్తూ సంఘటిత శక్తిని చాటుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోచారం శ్రీనివాస రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బిజెపి నాయకుడు బద్దం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిహెచ్ ఇఎల్ తదితర ప్రాంతాల్లో కూడా శుక్రవారం మానవ హారాలు ఏర్పాటు చేశారు.