వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నేతను విడిచిన మావోయిస్టులు

పెదవలస ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నట్టు సమాచారం అందడంతో అటువైపుగా పోలీసులు దృష్టి సారించారు. వార్ జోన్‌గా పేరుపొందిన కొయ్యూరు మండలం కన్నవరానికి చెందిన సీందరి పెద రంగారావు, కంకిపాటి లకి జైలులో ఉన్నారు. మావోయిస్టులు వీరిని వదిలిపెట్టమని డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అమిత్ బాగ్చి, రాష్ట్ర కమిటీ సభ్యుడు రవిశర్మ పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిని విడిచిపెట్టమని మావోయిస్టులు పట్టుబట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిందటి నెలలో మిలీషియా సభ్యురాలు కంకిపాటి లక్ష్మిని పోలీసులు వార్డు సభ్యుడు కాకూరి బాలయ్య ఇంటివద్ద పట్టుకున్నారు. లక్ష్మి అతనికి బంధువు కావడంతో తరచూ అక్కడకు వస్తుంటుంది. దీంతో పోలీసులు అతడిపై బైండోవర్ కేసు పెట్టారు.