లగడపాటి జోకర్, బ్రోకర్: హరీష్

సీమాంధ్ర నాయకులే తమను, తమ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణవారు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యను ఆయన ఖండించారు. లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్న తీరు తమను, తమ ప్రజలను కించపరిచే విధంగా ఉందని ఆయన అన్నారు. అలాగే తెలుగుదేశం శాసనసభ్యుడు కొడాలి నాని వ్యాఖ్యలు ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారో తెలియజేస్తాయని ఆయన అన్నారు. తాము సహనం వహిస్తున్నామిి, సీమాంధ్ర నాయకులే రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, తమ సహనం నశించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications