కమిటీ విధివిధానాల వెల్లడికి రోశయ్య బ్రేక్

బడ్జెట్ ప్రతిపాదించేవరకు శాసనసభ సజావుగా సాగితే చాలునని, ఆ తర్వాత సభ నడవకున్నా ఇబ్బంది ఉండదని ఆయన సూచించినట్లు సమాచారం. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు వెల్లడిస్తే దానిపై వ్యతిరేకతతో ఏ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులైనా శాసనసభ సమావేశాలను అడ్డుకునే అవకాశం ఉందని, అందువల్ల ఏదో విధంగా విధివిధానాల వెల్లడిని వాయిదా వేస్తూ రావడమే మంచిదని రోశయ్య భావనగా తెలుస్తోంది. అయితే, విధివిధానాలు వెల్లడించకపోతే శాసనసభ సమావేశాలను అడ్డుకుంటామని కాంగ్రెసు తెలంగాణ నాయకులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications