బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సాగేనా?

కాగా, కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించకపోతే రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అంటున్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా ఉండాలని, దానికి నిర్దిష్ట కాలపరిమితి కూడా ఉండాలని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. తాము తెలంగాణ జెఎసి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలుగుదేశం తెలంగాణ నాయకులు చెబుతున్నారు. కాగా, ఈ నెల 11వ తేదీన సారథ్య బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ చెబుతున్నారు. ఆ తర్వాత తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆయన అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటే సీమాంధ్ర సభ్యులు శాసనసభా సమావేశాలను నడవనిస్తారా అనేది కూడా సందేహంగానే ఉంది. బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 20వ తేదీన బడ్జెట్ ను ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి రోశయ్య ఆలోచిస్తున్నారు. మొత్తం మీద, శాసనసభ బడ్జెట్ సమావేశాలపై నీలినీడలు అలుముకున్నాయి.