ముంబై: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ సినిమా మై నేమ్ ఈజ్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించడాన్ని ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై శివసేన దండెత్తింది. మై నేమ్ ఈజ్ అశోక్ ఖాన్ పేర తన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. పాకిస్తాన్ ప్రేమికుడైన ఖాన్ వైపు అశోక్ చవాన్ తన ముఖ్యమంత్రి పదివిని కాపాడుకోవడానికి మొగ్గు చూపుతున్నారని ఆ సంపాదకీయంలో శివసేన చీఫ్ బాల్ థాకరే వ్యాఖ్యానించారు. మై నేమ్ ఈజ్ కసబ్ పేర సినిమా తీయాలని ఆయన చవాన్ కు సూచించారు.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తమ నేత బాల్ థాకరేతో సమావేశం కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని శివసేన ఆరోపించింది. సమస్య పరిష్కారానికి తాను థాకరేను కలవడానికి సిద్ధమని అమెరికా పర్యటన నుంచి వచ్చిన అనంతరం షారూఖ్ ప్రకటించారని, కాంగ్రెసు - ఎన్సీపి కుట్ర చేసి భేటీ జరగకుండా చూశాయని సామ్నా పత్రికలో శివసేన ఆరోపించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి